W3.CSS

కొండమడుగులో వంద అడుగుల బాబా విగ్రహం ఆవిష్కరణ 
02-01-2017 01:45:30
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు శివారులోని సాయి సిటీ సేవాశ్రమంలో వంద అడుగుల సాయిబాబా విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సాయి సేవా ఆశ్రమ వ్యవస్థాపకుడు అమ్ముల సాంబశివరావు సారథ్యంలో నిర్మించిన బాబా విగ్రహాన్ని శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి ఆవిష్కరించారు. అంతకుముందు సాయి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా సేవాశ్రమంలో పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 3గంటల సమయంలో పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావు 19వ బ్యాచ్‌కు చెందిన సాయి సేవకులందరికి జీవితకాల దీక్షలు ఇచ్చారు. వేద మంత్రమాలలో ఉత్తీర్ణులైన సాయి సేవకులకు ధృవపత్రాలు అందజేశారు. సాయికోటి పుస్తకాలను బాబా పాదాల కింద నిర్మించిన మహాస్థూపంలో నిక్షిప్తం చేశారు. వేలాది భక్తజన సందోహం మధ్య బాబాకు కాగడ హారతి, సుప్రభాత సేవ అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక సాయి సత్యవ్రతాలు కన్నుల పండువగా జరిగాయి. కాగా ప్రపంచంలోనే ఎత్తైన సాయిబాబా విగ్రహాన్ని నిర్మించడం ద్వారా కొండమడుగు పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుందని స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు

                    ఫూజ్యగురుదేవులు                                 శ్రీ అమ్ముల సాంబశివరావు గారి                 దివ్య సత్సంగ ప్రసంగములు