sai1.mp3

ఎ) భారతీయుల ఆరాధ్య గ్రంధాలైన రామాయణ, మహాభారతాల తరువాత ప్రస్తుతకాలంలో శ్రీ షిరిడి సాయినాథుని జీవిత చరిత్ర ప్రాధాన్యత వహిస్తున్నది.

బి) మహాభారతము రాజకీయాలు, ఎత్తుకి పై ఎత్తులు వీటికి ప్రాధాన్యమైనది. మనస్సును ఆలోచింపచేసి మంచివైపుకు మార్చగలుగుతుంది.

సి) రామాయణము మానస హృదయాలను కదిలించి పవిత్రపరచగల మహాకావ్యము.

డి) శ్రీ షిరిడి సాయిబాబావారి జీవిత చరిత్ర దిగజారి పోతున్న దైవనమ్మకాన్ని ధృడపరచి శరీరపతనం తరువాత కూడ ఆత్మ నిత్యసత్యమై నిలిచి వుంటుందనే నమ్మకాన్ని కలిగిస్తూ, హీనులకు,దీనులకు,పాపులకు,పతితులకే కాకుండా సమస్త మానవాళికి సాయిరక్షణ కలదని నిరూపించే గొప్ప మహిమాన్విత గ్రంధరాజం,గ్రంధసింహం శ్రీ షిరిడి సాయిబాబవారి జీవిత చరిత్ర.

... అమ్ముల షిరిడి సాయి తత్వ బోధామృతము - 1 వ భాగము, పేజి 50:పాయింట్ 337

మేలు చేయకపోయిన పరవాలేదు ఎవరికి కీడు చేయ వద్దు గురువును త్రికరణశుద్ధిగా నమ్మినపుడు, ఆ గురువు ఏమి చెబితే అది చేయాలి