కాకినాడలో భారీ సాయిబాబా విగ్రహం

Sakshi | Updated: December 06, 2012 06:08 (IST)

India :పెన్షనర్స్‌ ప్యారడైజ్‌గా కాకినాడకు పేరు. ఇపుడు ఆధ్యాత్మిక చింతనలో గుర్తింపు తెచ్చుకుంటుంది. ప్రపంచంలోనే భారీ షిర్డిసాయిబాబా విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పుతున్నారు.సాయి భక్తులకు పుణ్యక్షేత్రం కానుంది. 

విశ్వశాంతికి సర్వమత సమేళనం శ్రేయస్సకరమంటూ తన ప్రభోధనలతో కోట్లాది మంది భక్తులను ఆధ్యాత్మిక చింతనలో నడిపించారు శ్రీ షిర్డీ సాయి బాబా.అటువంటి బాబాకు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా .... 116 ఎత్తు ఉన్న భారీ సాయిబాబా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమం.కాకినాడ రూరల్ రేపూరులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూజ్యగురు దేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు.ఈ విగ్రహానికి విరాట్ షిరిడి సాయి అనే నామకరణం చేశారు. 2011 లో ఈ విగ్రహాం నిర్మాణాన్ని ప్రాంభించారు.ఈ నెల 15 వతేది నుండి 23 వతేది వరకు ఆశ్రమంలో విగ్రహా ప్రజాంకిత ప్రతిష్టా మహోత్సవాలను నిర్వహించనున్నారు.23 వ తేదిన ఈ విగ్రహన్ని ప్రారంభించనున్నట్లు ఆశ్రమ ట్రస్టీలు వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఈ విగ్రహానికి చాల ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ విగ్రహం బరువు దాదాపు 1000 టన్నుల వరకు ఉంటుంది.బాబా వారి కాలు క్రింద సుమారు 5 కోట్ల  సాయి నామాలు నిక్షిప్తం చేసేందుకు వీలుగా సాయికోటి స్ధూపాన్ని నిర్మించారు.దీంతో ఈ భారీ బాబా వారి విగ్రహాన్ని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి రేపూరుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
ప్రపంచ శ్రేయస్సు కోసం తన భోధనలతో దైవంగా నిలిచిన బాబాకు ...భక్తులు కొబ్బరికాయలు...గుమ్మడి కాయలు కొట్టి తమ భక్తి భావాన్ని చూటుకుంటున్నరు.అలాగే బాబాకు భజనలు,ప్రత్యేక పూజలు,యాగాలు చేస్తున్నారు.