చాలా మంది షిరిడిసాయి భక్తులు సాయిని కేవలము వరాలిచ్చే ఒక దేవునిగా మాత్రమే భావించి పూజిస్తారు. యదార్థానికి సాయి సృష్టికర్త, పోషక కర్త, సర్వ సృష్టిని క్షణకాలంలో సర్వనాశనం చేయగల అనూహ్యమైన శక్తులుగల లయకర్తకూడ, షిరిడిసాయిని పాలరాతి రూపంలో గుళ్ళలో కూర్చుని భక్తుల పూజలందుకునే సామాన్య దేవుడిగా బావించరాదు. సృష్టి,స్థితి,లయకారకమైన పరమపాపన ఉగ్రశక్తిగా కూడా తెలుసుకోవాలి.                                                                                                                   అమ్ముల షిరిడి సాయి తత్వబోధామృతము - 1వ భాగము, పేజి 298: పాయింట్ 2213

 

మనిషి జీవితంలో భౌతికంగాను, ఆధ్యాత్మికంగానూ సుఖసంతోషాలతో ఉండాలంటే,

పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావుగారు

సూచించే సులభమార్గాలు

1. పుట్టినప్పటి నుండి సుమారు 15 సంవత్సరాల వయస్సు వరకు అమాయకత్వపు జీవితం. ఈ వయసులో తల్లిదండ్రులను అనుసరించి ఉండాలి.

2. 15 నుంచి 25 సంవత్సరముల వయస్సు: ప్రతి మనిషి జీవితంలో బంగారుదశ. ఈ వయసులో కష్టపడి నియమనిష్టలతో అన్ని విషయములు తెలుసుకోవలసిన సమయము. ఈ విధముగా ఈ వయసును గడిపిన వారు జీవితాంతము సుఖపడతారు. ఈ వయసులో చెడు అలవాట్లు, చెడు స్బేహాలు చేసినవారు జీవితాంతము బాధపడతారు. కాబట్టి భవిష్యత్ జీవితమునకు ఈ వయసు పునాది వంటిదని గుర్తించాలి.

3. 25 నుంచి 50 సంవత్సరాల వయస్సు: ప్రతి మనిషి జీవితంలో తనదైన వయసు, జీవతం. తగుమాత్రముగానే పనిచేసుకొని, డబ్బు సంపాదించుకుని, సంసార పరంగాను, ఆధ్యాతంకంగాను మిగిలిన తైమును సద్వినియోగపరచుకోవలి. కేవలం డబ్బు సంపాదనకే పూర్తి సమయమును ఖర్చు పెట్టరాదు. అన్ని రకముల చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

4. 50 నుంచి 60 సంవత్సరముల వయస్సు: కుటుంబ బాధ్యతలైన పిల్లల పెల్లిళ్ళు,వృత్తి,వ్యాపార ఉద్యోగాదులలో వాళ్లను స్థిరపరచుట లాంటి పనులన్నీ పూర్తిచేసుకొని, ఆస్తుల పంపకముకూడా పూర్తి చేసి, తనకు కావలసినది తనవద్ద ఉంచుకొని, మిగినినదంతా కుటుంబ సభ్యులందరకూ న్యాయంగా పంచి ఇవ్వవలెను.

5. 60 నించి బ్రతికినంత కాలము పూర్తి ఆధ్యాత్మిక జీవితమును గడుపుతూ ఉండాలి.

                 మన పూర్వీకులు 1,2 విషయాలలో చెప్పబడిన వాటిని "ధర్మము" అని, 3,4 విషయములలోని వాటిని "అర్థ,కామము"లని, 5వ విషయములోని దానిని మోక్షము అని, వీటన్నింటినీ కలిపి ధర్మార్థ కామమోక్షములని చెప్పినారు.

నా భక్తునికి కావలసినది సమత కాని మమత కాదు. నీ హృదయమును పవిత్ర పరచుకొనినచో, నేను వచ్చి అందులోనే వుంటాను.